ప్రాథమిక సహకార బ్యాంకు ఉద్యోగుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ప్రాథమిక సహకార బ్యాంకు ఉద్యోగుల ఆందోళన

Jul 21 2026 1:18 AM | Updated on Jul 21 2026 1:18 AM

తిరువళ్లూరు: ప్రాధమిక సహకార బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిస్కరించాలని కోరుతూ ఉద్యోగులు సోమవారం ఉదయం కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యాక్రమానికి సంఘం జిల్లా కార్యదర్శి త్యాగరాజన్‌ అధ్యక్షత వహించగా సంఘం నేతలు మురుగేషన్‌, పొన్నన్‌ తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా త్యాగరాజన్‌ మాట్లాడుతూ రేషన్‌ దుకాణాల్లో వికలాంగులకు ఇంటి వద్దకే సరుకులను పంపిని చేసే తాయుమానవర్‌ పథకాన్ని పునఃసమిక్షించాలని, కచ్చితంగా అమలు చేయాల్సి వస్తే పథకంలోని లోపాలను సరి చేయాలని డిమాండ్‌ చేశారు. 2021 ముందు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పించన్‌ మంజూరు చేయాలి. రెండు సంవత్సరాల పాటూ ఉద్యోగం నిర్వహిస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌లను పర్మినెంట్‌ చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. సహకార బ్యాంకుల్లో ఆభరణాల మదింపుదారులను అర్హతను బట్టి వారి ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్‌లను పరిష్కరించని పక్షంలో ఆందోళననూ ఉదృతం చేస్తామన్నారు. ఈ ఆందోళనలో సంఘం నేతలు మారి, నూర్‌మహ్మాద్‌, జిల్లా సంయుక్త కార్యదర్శులు జయచంద్రన్‌, విఎస్‌ మేఘనాథన్‌ పొల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement