జాతీయ అవార్డు గ్రహీతలకు సీఎం అభినందనలు | - | Sakshi
Sakshi News home page

జాతీయ అవార్డు గ్రహీతలకు సీఎం అభినందనలు

Jul 20 2026 12:38 AM | Updated on Jul 20 2026 12:38 AM

తమిళసినిమా: 72వ జాతీయ సినీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. 2024వ ఏడాదికి గానూ ప్రకటించిన ఈ జాతీయ అవార్డుల్లో తమిళ చిత్ర పరిశ్రమ ఏకంగా 10 అవార్డులను గెలుచుకుని చరిత్ర సష్టించింది.

ఇందులో నటుడు ధనుష్‌ కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన రాయన్‌ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. అదే విధంగా. ధనుష్‌ హీరోగా నటించిన మరో చిత్రం కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రం జాతీయ సామాజిక, పరివాహక పరిరక్షణ అవగాహన అవార్డు , ఈ చిత్రంలో నటించిన ధనుష్‌ కు స్పెషల్‌ కేటగిరీ గెలుచుకుంది.అదఘ విధంగా శివకార్తికేయన్‌ హీరోగా కమలహాసన్‌ తన రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకుంది. ఆ చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ ను ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు వరించింది.ఆ చిత్ర ఆర్ట్‌ డైరెక్టర్‌కి ఉత్తమ కళాదర్శుకుడ అవార్డు వరించింది. ఇకపోతే విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన మహారాజా చిత్రానికి గాను అనల్‌ అరసుకు ఉత్తమ స్టంట్‌ మాస్టర్‌ అవార్డు, అందులో నటించిన నటి సచ్చునకు ఉత్తమ సహాయ నటి అవార్డు వరించాయి. నటుడు కార్తీ, అరవింద స్వామి కలిసి నటించిన మెయ్యళగన్‌ చిత్రానికి గాను ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌ అవార్డును సురేన్‌ జీ కో ప్రకటించారు. బ్లూ అనే షార్ట్‌ ఫిల్మ్‌కు గానూ ఉత్తమ సౌండ్‌ ఇంజనీర్‌ అవార్డు టీఎస్‌.హరిహర సుదన్‌ను వరించింది. కాగా తమిళ చిత్ర పరిశ్రమకు 10 జాతీయ అవార్డులను అందించిన సినీ కళాకారులకం ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement