ప్రభుత్వ బస్సు–షేర్‌ ఆటో ఢీ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బస్సు–షేర్‌ ఆటో ఢీ

Jul 19 2026 1:56 AM | Updated on Jul 19 2026 1:56 AM

● 5 ఏళ్ల చిన్నారితో సహా ఇద్దరు మృతి ● ఐదుగురికి గాయాలు

● 5 ఏళ్ల చిన్నారితో సహా ఇద్దరు మృతి ● ఐదుగురికి గాయాలు

అన్నానగర్‌: శివగంగై జిల్లాలోని తిరుప్పువనం సమీపంలో షేర్‌ ఆటో, ప్రభుత్వ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఐదేళ్ల చిన్నారితో సహా ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. మదురై జిల్లాలోని మదిసియత్‌కు చెందిన అశోక్‌, ఇతని భార్య ప్రియ, పిల్లలు రివంతిక (5), కృష్ణవేణి (60) సహా ఏడుగురు, స్వామిని దర్శించటానికి శనివారం తిరుప్పువనం మీదుగా మానమదురై వైపు షేర్‌ ఆటోలో వెళ్లారు. తిరుప్పువనంలోని పుత్తూరు వద్దకు రాగానే రామనాథపురం నుంచి మధురై వెళ్తున్న ప్రభుత్వ బస్సు, షేర్‌ ఆటో ఎదురెదురుగా ఢీ కొనడంతో చిన్నారులు రివంతిక, కృష్ణవేణి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలు చెందిన మరో ఐదుగురిని రక్షించి 108 అంబులెన్సుల ద్వారా తిరుప్పువనం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తిరుప్పువనం పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

38 చోట్ల జయలలిత

పేరవై సమావేశాలు

– 25వ తేదీ నుండి ఏప్రిల్‌ 17వ తేదీ వరకు

కొరుక్కుపేట: జయలలిత పెరవై తమిళనాడు వ్యాప్తంగా 38 చోట్ల సంప్రదింపుల సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సభలు జూలై 25 నుంచి ఏప్రిల్‌ 17 వరకు ప్రతి శనివారం జరుగుతాయని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఏఐఏడీఎంకే తిరిగి అధికారంలోకి రావడానికి చేయాల్సిన నిర్మాణాత్మక పనులు, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, నెరవేర్చలేని రకరకాల వాగ్దానాలు చేస్తూ అధికారంలో తడబడుతున్న ప్రస్తుత బూటకపు ప్రభుత్వ నిజస్వరూపాన్ని ప్రజలకు వివరించడం వంటి విషయాలపై ఒక సంప్రదింపుల సమావేశం జరగనుంది. ఈ సమావేశం జూలై 25 నుంచి ఆరంభం అవుతుందన్నారు. ఈ సంప్రదింపుల సమావేశాలకు జయలలిత కౌన్సిల్‌ కార్యదర్శి, మదురై సబర్బన్‌ వెస్ట్‌ జిల్లా విద్యా కార్యదర్శి మాజీ మంత్రి ఆర్‌.పి. ఉదయకుమార్‌ అధ్యక్షత వహిస్తారని తెలిపారు.

ఆగస్టు మొదటి వారంలో వార్షిక బడ్జెట్‌

– ఆర్థిక మంత్రి మరియ విల్సన్‌

సాక్షి, చైన్నె : తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక స్థితి నివేదిక (బడ్జెట్‌)ను ఆగస్టు మొదటి వారంలో శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి మరియ విల్సన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు తూత్తుకుడి విమానాశ్రయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ను ఆగస్టు మొదటి వారంలోనే ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం విజయ్‌ నేతృత్వంలో ప్రజా రంజక పాలనకు అనుగుణంగా ఈ బడ్జెట్‌ రూపకల్పన ఉంటుందన్నారు. డిఎంకె మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనితా ఆర్‌. రాధాకృష్ణన్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. టీవీకే ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందంటూ మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ తన అజ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులు, ప్రజల నాడి ఇంకా ఆయనకు అర్థం కాలేదన్నారు. అందుకే ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును గౌరవించే సంస్కారం ఆయనకు లేనట్టుందన్నారు. అటు డిఎంకె నాయకత్వానికి కూడా ఈ విషయం అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పునకు ఎవరైనా సరే ముందుగా తలవంచాల్సిందేనని మంత్రి హితవు పలికారు.రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్పందిస్తూ..సీఎం విజయ్‌ అవినీతికి వ్యతిరేకంగా తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలను, వేగవంతమైన చర్యలను రాష్ట్ర ప్రజలు 100 శాతం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారన్నారు.

మేఘదాతుపై వాయిదా తీర్మానానికి డీఎంకే నోటీస్‌

సాక్షి, చైన్నె : కావేరి నదిపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేఘదాతు డ్యాం వివాదంపై పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టేందుకు డీఎంకే నోటీస్‌ ఇచ్చింది. డీఎంకే లోక్‌సభ పక్ష నేత టి.ఆర్‌. బాలు ఎంపీ, రాజ్యసభ పక్ష నేత తిరుచ్చి శివ ఎంపీలు ఈ మేరకు పార్లమెంట్‌ ఉభయ సభల సెక్రటేరియట్లకు విడివిడిగా శనివారం నోటీసులు అందజేశారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు రాబోయే 20వ తేదీ నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో డీఎంకే ఈ నోటీసు గురించి ప్రకటనను విడుదల చేసింది. లోక్‌సభ, రాజ్యసభల అధికారిక నిబంధనల ప్రకారం.. సభలో షెడ్యూల్‌ చేసిన ఇతర వ్యాపారాలన్నింటినీ తాత్కాలికంగా పక్కనబెట్టి, అత్యంత ప్రాధాన్యత కలిగిన మేఘదాతు అంశంపై వాయిదా తీర్మానం తీసుకురావాలని నోటీసులో కోరినట్టు వివరించారు. ఈ డ్యాంను వ్యతిరేకిస్తూ జూన్‌ 19న తమిళనాడు శాసనసభలో సీఎం విజయ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడిన విషయాన్ని తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement