వేలూరు: ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందజేయాలని కలెక్టర్ లీల అలెక్స్ అధికారులను ఆదేశించారు. మీకోసం మీ ఊరిలో ఒక రోజు అనే పథకం కింద కలెక్టర్ వేలూరు జిల్లా కాట్పాడి నియోజక వర్గం పరిధిలోని గాంధీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందజేస్తున్న ఆహారం, వంటకాలను కలెక్టర్ లీల అలెక్స్, ఎమ్మెల్యే సుధాకర్‌లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజూ అందజేసే ఆహారం నాణ్యతగాను రుచికరమైనవి గాను ఉండాలన్నారు. అదే విధంగా వంటగదిలో పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం గాంధీనగర్ ప్రాంతంలో పారిశుధ్య కార్మికుల వద్ద నేరుగా వెల్లి చెత్తను ఏవిధంగా సేకరిస్తున్నారు. ఆ సమయంలో కొంత మంది మహిళలు పెన్షన్ కోసం వినతిపత్రాలు సమర్పించుకున్నారు. వీటిపై విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌తో పాటూ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


