కట్టా కుస్తీ –2 చిత్రానికి రజనీకాంత్‌ ప్రశంసలు | - | Sakshi
Sakshi News home page

కట్టా కుస్తీ –2 చిత్రానికి రజనీకాంత్‌ ప్రశంసలు

Jul 17 2026 3:34 AM | Updated on Jul 17 2026 3:34 AM

తమిళసినిమా: నటుడు విష్ణు విశాల్‌, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన తాజా చిత్రం కట్టా కుస్తీ – 2.ఇది ఇంతకు ముందు వచ్చిన కట్టా కుస్తీ చిత్రానికి సీక్వెల్‌. సెల్లా అయ్యావు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ఐసరి గణేష్‌ కు చెందిన వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ, విష్ణు విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ కలిసి నిర్మించాయి. కాగా ఈ నెల 3వ తేదీన విడుదల అయిన కట్టా కుస్తీ 2 చిత్రం ప్రేక్షకులను ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాగా ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన రజినీకాంత్‌ నటుడు, నిర్మాత విష్ణు విశాల్‌కు ఫోన్‌ చేసి చిత్రం బాగుందని ప్రశంసించారట. దీని గురించి నటుడు విష్ణు విశాల్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొంటూ ‘‘ మన ఓకే ఒక్క సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నాకు ఫోన్‌ చేసి కట్టా కుస్తీ –2 చిత్రం సూపర్‌ గా ఉందని అభినందించడం మనసుకి ఎంతో సంతోషాన్ని కలిగించింది. జారీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కథా చిత్రం. ఇలాంటి చిత్రం ఇటీవల రాలేదు. చాలా మంది పెర్ఫార్మెన్స్‌ చేశారు. ఐశ్వర్య లక్ష్మి చాలా బాగా నటించారు. చిన్నారి సారా పాపను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. అద్భుతంగా నటించింది. విష్ణు విశాల్‌ మీకు మంచి స్క్రిప్ట్‌ సెన్స్‌ ఉంది. మంచి చిత్రాలు ఇంకా చేయండి ‘‘అని రజనీకాంత్‌ అన్నారని పేర్కొన్నారు. నా ఈ మొత్తం పయనానికి సంతోషాన్ని కలిగించింది ఆయన ఫోన్‌కాల్‌లో చేసిన ప్రశంసలేనని విష్ణు విశాల్‌ పేర్కొన్నారు. రజనీకాంత్‌ మాటలు తన తదుపరి పయనానికి ప్రోత్సాహాన్ని ఇస్తాయంటూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement