ప్రీతి ముకుందన్‌కు లక్కీఛాన్స్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రీతి ముకుందన్‌కు లక్కీఛాన్స్‌

Jul 17 2026 3:34 AM | Updated on Jul 17 2026 3:34 AM

ట్రైన్‌ చిత్ర కథను నేను వినలేదు..

తమిళసినిమా: నటుడు విజయ్‌ సేతుపతి , శృతిహాసన్‌ జంటగా నటించిన తాజా చిత్రం ట్రైన్‌. కలైపులి ఎస్‌ ధాను తన వీ.క్రియేషన్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి మిష్కిన్‌ కథ, సంగీతం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. మహిళా ఉమెన్‌ కెమెరామెన్‌ ఫౌసియా ఛాయాగ్రహణంను అందించిన ఈ చిత్రంలో నాజర్‌, కేఎస్‌ రవికుమార్‌, సింగం పులి, యూకీ నరేన్‌, నటి ప్రీతి కరణ్‌, మాళవిక సుందర్‌, ఐరా దయానంద్‌, జనని తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ కథా చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఇటీవల చైన్నెలో నిర్వహించిన ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత కలైపులి ఎస్‌ ధాను ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా తాను నిర్మించే చిత్రాలకు తాను కథలు వింటానని అయితే ట్రైన్‌ చిత్ర కథను వినలేదని చెప్పారు. అదేవిధంగా ఈ చిత్రం ఆలస్యానికి తాను కారణం కాదన్నారు. ఈ చిత్రం కోసం తాను తొలి సారిగా 8 కంపార్ట్‌మెంట్స్‌తో కూడిన ట్రైన్‌ సెట్‌ ను వేసినట్లు చెప్పారు. నటుడు విజయ్‌ సేతుపతి ట్రైన్‌ చిత్రం కోసం ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. దర్శకుడు మిష్కిన్‌ మాట్లాడుతూ ఇందులో విజయ్‌ సేతుపతి చేసిన పాత్ర చాలాకష్టం అని పేర్కొన్నారు. అంతగా ఈ కథను విజయ్‌ సేతుపతి కోసమే రాసినట్లు చెప్పారు.ఈయన ఒక వాల్కనో మాదిరి అని పేర్కొన్నారు. ఈ చిత్రం విడుదల కోసం మేమంతా ఎంతగానో ఎదురు చూస్తున్నామని, నిర్మాత కలైపులి ఎస్‌ ధాను చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేస్తానని చెప్పడంతో చాలా సంతోషంగా ఉందని నటుడు విజయ్‌ సేతుపతి పేర్కొన్నారు.

తమిళసినిమా: వరుసగా లక్కీఛాన్స్‌ను అందుకుంటూ స్టార్‌ అంతస్తుకు దూసుకుపోతున్న నటి ప్రీతి ముకుందన్‌. డాన్సర్‌, మోడల్‌ అయిన ఈ తిరుచిరాపల్లి బ్యూటీ ఓం భీమ్‌ బుష్‌ అనే తెలుగు చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఓకే అనిపించుకోవడంతో మరిన్ని అవకాశాలు తలుపు తడుతున్నాయి. నటుడు మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం కథానాయకిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలా తమిళంలోకి స్టార్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల నటుడు అర్జున్‌, అభిరామితో కలిసి ఈ అమ్మడు నటించిన బ్లాస్ట్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా నటుడు అధర్వకు జంటగా నటించిన ఇదయం మురళి చిత్రం గత శుక్రవారం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం దశమకన్‌ అనే తమిళ చిత్రంతో పాటు ఒక మలయాళ చిత్రం, హిందిలో నాగ్‌ జిల్లా అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. 2024లో నటిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ రెండేళ్లలోనే పాన్‌ ఇండియా నటిగా పేరు తెచ్చుకుంది. కాగా తాజాగా కోలీవుడ్‌ లో మరో లక్కీ ఛాన్స్‌ కొట్టేసినట్లు సమాచారం. నటుడు ధనుష్‌ నటించనున్న ఆయన 56వ చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశం ఈ అమ్మడిని ఽవరించినట్లు తాజా సమాచారం. రబ్బర్‌ బంతు చిత్రం ఫేమ్‌ తమిళరసన్‌ మారి ముత్తు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని డాన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రంలో ముందు నటి రుక్మిణి వసంత్‌ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆమె తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి ఎక్కువ కాల్‌ షీట్స్‌ కేటాయించడంతో ధనుష్‌తో జత కట్టలేని పరిస్థితి అనీ దీంతో ఆ అవకాశం నటి ప్రీతి ముకుందన్‌ను వరించినట్లు టాక్‌. కాగా ఈ చిత్రం ఆగస్టు నెలలో సెట్‌ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. కాగా ధనుష్‌ ప్రస్తుతం రాజ్‌ కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో ఓం చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement