పర్యాటక రంగంలో సరికొత్త భాగస్వామ్యాలు | - | Sakshi
Sakshi News home page

పర్యాటక రంగంలో సరికొత్త భాగస్వామ్యాలు

Jul 17 2026 3:34 AM | Updated on Jul 17 2026 3:34 AM

– మంత్రి రాజేష్‌కుమార్‌

సాక్షి, చైన్నె : ప్రతిష్టాత్మక ట్రావెల్‌ అండ్‌ టూరిజం ప్రదర్శన ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ మార్ట్‌ –26 గురువారం చైన్నెలో ప్రారంభమైంది. మూడు రోజుల పాటుగా చైన్నె ట్రేడ్‌ సెంటర్‌లో జరిగే ఈ ప్రదర్శనలో బీ2బీ,బీ2సీ కార్యక్రమంలో ఈవెంట్‌, పర్యాటక, హాస్పిటాలిటీ, విమానయాన రంగాలకు చెందిన ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది.స్పియర్‌ ట్రావెల్‌మీడియా – ఎగ్జిబిషన్స్‌ సంస్థ నిర్వహించిన ఈ ప్రదర్శనను రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి రాజేష్‌ కుమార్‌ సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎస్‌. స్వర్ణ , తమిళనాడు టూరిజం డైరెక్టర్‌, టిటిడిసి ఎండి డాక్టర్‌ వి.పి. జయశీలన్‌ల తో పాటు టీఏఏఐ, టీఏఎఫ్‌ఐ, సిహ్రా, ఐఆర్‌సిటిసి వంటి ప్రముఖ పర్యాటక సంఘాల అధ్యక్షులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పియర్‌ ట్రావెల్‌మీడియా డైరెక్టర్‌ రోహిత్‌ హంగల్‌ మాట్లాడుతూ, దేశీయ పర్యాటకం, అంతర్జాతీయ కనెక్టివిటీ వేగంగా వృద్ధి చెందుతున్నాయన్నారు. ఇందులో భాగంగానే అన్ని విభాగాలను ఒక చోటచేర్చామన్నారు.మంత్రి రాజేష్‌కుమార్‌ మాట్లాడుతూ తమిళనాడు పర్యాటకంగా ప్రసిద్ధి చెంది ఉందని, ఈరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి సంపూర్ణ సహకారం, తోడ్పాటును ప్రభుత్వం అందిస్తుందన్నారు. మరో డైరెక్టర్‌ శ్రీ సంజయ్‌ హఖు మాట్లాడుతూ, దేశీయ, అంతర్జాతీయ, ఆధ్యాత్మిక , వ్యాపార పర్యాటక రంగాలకు చైన్నె నగరం భారతదేశంలోనే అత్యంత కీలకమైనది అవతరించిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement