‘జుమాంక’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

‘జుమాంక’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల

Jul 17 2026 3:34 AM | Updated on Jul 17 2026 3:34 AM

తమిళసినిమా: కథానాయకుడు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, కామెడియన్‌ ఇలా ఆల్‌ రౌండర్‌ గా పేరు తెచ్చుకున్న నటుడు మునీష్‌ కాంత్‌. ఈయన తాజాగా దర్శకుడు బాలాజీ శక్తివేల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం జుమాంక . అశోక్‌ రామ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని జేపీ సినిమాస్‌ పతాకంపై జయకుమార్‌, ప్రీతి కలిసి నిర్మిస్తున్నారు. ప్రాచీన కెమెరా నేపధ్యంలో రూపొందుతున్న వైవిధ్య భరిత కథా చిత్రంగా ఇది ఉంటుందని యూనిట్‌ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవలే షూటింగ్‌ చైన్నెలో ప్రారంభించి పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ చిత్రం కోసం బ్రహ్మాండ సెట్‌ వేసి ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. కాగా ఇందులో మునీష్‌కాంత్‌, బాలాజీ శక్తివేల్‌, రెడిన్‌ కింగ్స్‌ లీ, వివేక్‌ ప్రసన్న, కల్కీరాజ్‌, జాన్సన్‌ దివాకర్‌, జయ్‌ కుమార్‌ , వినోద్‌ మున్నా వంటి ప్రముఖ కామెడీ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫాంటసీ కామెడీ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. కాగా చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను నటుడు, సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని విడుదల చేశారని చెప్పారు. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చూసిన ఆయన చాలా బాగున్నాయని దర్శకుడు అశోక్‌ రామ్‌ను, నిర్మాత విజయ్‌ కుమార్‌ తదితర యూనిట్‌ సభ్యులను ప్రశంసించి చిత్రం మంచి విజయాన్ని సాధించాలని శుభాకాంక్షలు అందించారని చెప్పారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement