వందశాతం ఓటింగ్‌పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

వందశాతం ఓటింగ్‌పై అవగాహన

Apr 11 2026 8:28 AM | Updated on Apr 11 2026 8:28 AM

పళ్లిపట్టు: వంద శాతం ఓటింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా పళ్లిపట్టులో అంగన్‌వాడీ సిబ్బంది శుక్రవారం అవగాహన శిబిరం నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్‌ను ప్రోత్సహించే విధంగా జిల్లా యంత్రాంగం ద్వారా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పళ్లిపట్టులో చిన్నారుల సంరక్షణ పథకం ద్వారా మండల చిన్నారుల సంక్షేమ అధికారి దానియ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొని వందశాతం ఓటింగ్‌కు సంబంధించి ముగ్గులు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్య బాధ్యతలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం బీడీఓ కార్యాలయం ప్రాంతంలో వందకు పైగా అంగన్‌వాడీ సిబ్బంది ప్లకార్డులు చేతబట్టి ప్రజలకు వందశాతం ఓటింగ్‌లో పాల్గొనడంపై అవగాహన కల్పించారు. చివరగా ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధంగా అవగాహన కల్పించడంపై ప్రతిజ్ఞ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement