ఎన్నికల్లో అన్నాడీఎంకేకు బుద్ధి చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో అన్నాడీఎంకేకు బుద్ధి చెప్పాలి

Apr 11 2026 8:28 AM | Updated on Apr 11 2026 8:28 AM

పళ్లిపట్టు: మతతత్వ బీజేపీతో జతకట్టిన అన్నాడీఎంకేకు ఎన్నికల్లో ముస్లిం, క్రైస్తవులు బుద్ధి చెప్పాలని డీఎండీకే అభ్యర్థి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. తిరుత్తణి డీఎండీకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణమూర్తి శుక్రవారం పళ్లిపట్టులోని జమ్మా మసీదులో ప్రార్థనలు చేసి వెలుపలికి వచ్చిన ముస్లింల వద్ద ఓట్లు అభ్యర్థించారు. మైనార్టీలకు నిత్యం అండగా వుంటున్న డీఎంకే–కాంగ్రెస్‌ కూటమిని ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. మతం పేరిట ప్రజలను చీల్చి రాజకీయ లబ్ధి పొందుతున్న బీజేపీతో జతకట్టిన అన్నాడీఎంకేకు ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మండల డీఎంకే కార్యదర్శి సీజే.శ్రీనివాసన్‌, పట్టణ కార్యదర్శి సెంథిల్‌కుమార్‌, కాంగ్రెస్‌ పట్ణణ అధ్యక్షుడు శివకుమార్‌ సహా అనేక మంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement