జీనీ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

జీనీ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల

Mar 26 2024 2:05 AM | Updated on Mar 26 2024 6:57 AM

- - Sakshi

తమిళసినిమా: పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రం తరువాత జయం రవి కథానాయకుడిగా నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలు సాధించలేదు. దీంతో ఈయనకు అర్జెంట్‌గా ఒక హిట్‌ అవసరం. దాన్ని జీనీ చిత్రం తీరుస్తుందని భావించవచ్చు. జయాపజయాలకు అతీతంగా చిత్రాలను చేసుకుంటూ పోతున్న నటుడు జయంరవి. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం జీనీ. వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేశ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా అర్జునన్‌ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు మిష్కిన్‌ శిష్యుడన్నది గమనార్హం. జయం రవికి ఇది 35వ చిత్రం అవుతుంది. ఇందులో ఆయనకు జంటగా నటి కల్యాణి ప్రియదర్శన్‌, కృతిశెట్టి, వామిక దీపక్‌ నాయికలుగా నటిస్తున్నారు. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతాన్ని, మహేశ్‌ ముత్తుస్వామి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో జయంరవి ఆలీబాబా భూతం తరహాలో ఉన్నారు. ఆయన చుట్టూ బంగారు నాణేలు, డబ్బు నోట్లు, తెగిన చైన్లు, తినుబండారాలు ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొంది. దీని తరువాత జయం రవి తనీఒరువన్‌–2, అధర్వ తదితర చిత్రాల్లో నటించనున్నారు.

జీనీ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ 1
1/1

జీనీ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement