తిరువొత్తియూరు: తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించబడే గ్రూప్–2, గ్రూప్–2ఏ పరీక్షలు ఆదివారం జరిగాయి. మొత్తం 846 పోస్టు ల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించారు. ఇందులో గ్రూప్–2 పోస్టులు 43, గ్రూప్–2ఏ పోస్టులు 803 ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్– ఐఐ వంటి ఉద్యోగాల కోసం ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష కోసం తమిళనాడు వ్యాప్తంగా మొత్తం 4,89,885 మంది దరఖాస్తు చేసుకోగా, ఆదివా రం నాలుగున్నర లక్షల కంటే ఎక్కువ మంది పరీక్షకు హాజరయ్యారు. ఒక ఖాళీ పోస్టుకు సగటున 579 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,647 కేంద్రాలలో ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరిగింది. చైన్నెలో మాత్రమే 173 పరీక్షా కేంద్రాల్లో 51,721 మంది పరీక్ష రాశారు. ఈ పరీక్షలో మొ త్తం 300 మార్కులకు గానూ 200 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడిగారు. ఇందులో జనరల్ నాలెడ్జ్ విభా గం నుండి 75 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్ విభాగం నుండి 25 ప్రశ్నలు, జనరల్ తమిళ్ లేదా జనరల్ ఇంగ్లీష్ విభాగం నుండి 100 ప్రశ్నలు ఉన్నాయి. గ్రూప్–2 పరీక్షల నేపథ్యంలో ఆదివారం అన్ని పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దీపావళి సందర్భంగా
వడలూర్ మార్కెట్‌లో..
– ఒకే రోజులో రూ. 4 కోట్లకు మేకల విక్రయాలు
తిరువొత్తియూరు: దీపావళి పండుగను పురస్కరించుకుని వడలూర్ మార్కెట్‌లో ఒకే రోజులో రూ. 4 కోట్ల విలువైన మేకల విక్రయం జరిగింది. వ్యాపారులు ఒకరితో ఒకరు పోటీపడి మేకలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. వడలూర్‌లో వారాంతపు రోజైన ప్రతి శనివారం జరిగే ఈ సంత చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దీపావళి పండుగ సందర్భంగా శనివారం తెల్లవారుజామున 2 గంటల నుంచే వివిధ ప్రాంతాల నుండి మేకల అమ్మకాల కోసం తరలివచ్చారు. వడలూర్, దాని చుట్టుపక్కల ప్రాంతాలైన నెయ్ వేలి, పన్రూటి, కురింజిప్పాడి, సేత్తియాతోప్పు, భువనగిరి, కమ్మాపురం తదితర 40కి పైగా గ్రామాల నుండి రైతులు తాము పెంచిన తెల్ల మేకలు, కొడి మేకలు (పొడుగాటి రకం), గొర్రెలను అమ్మకానికి తీసుకువచ్చారు. మేకలను కొనుగోలు చేయడానికి కడలూరు, విలుప్పురం, కల్లకురిచ్చి, చైన్నె, తిరువణ్ణామలై, సేలం, తిరుచ్చి, మధురై, దిండిగల్ సహా తమిళనాడులోని వివిధ జిల్లాల నుండి, అలాగే పుదుచ్చేరి నుండి వ్యాపారులు వచ్చారు. మేకల బరువు, రకం వాటి నాణ్యతను బట్టి ధరలను నిర్ణయించారు. కనీస ధర రూ. 6 వేల నుండి గరిష్టంగా రూ. 35 వేల వరకు మేకలు అమ్ముడయ్యాయి. వ్యాపారులు పోటీపడి మేకలను కొనుగోలు చేశారు. శనివారం ఒక్కరోజే దాదాపు 1,500 మేకల వరకు విక్రయాలు జరిగినట్లు మార్కెట్ నిర్వాహకులు తెలిపారు. దీని ద్వారా సుమారు రూ. 4 కోట్ల వరకు వ్యాపారం జరిగినట్లు వారు పేర్కొన్నారు.
వెలుగులోకి పళణిలో మరో మోసం
సాక్షి, చైన్నె : పళని దండపాణి మఠంలో రూ.100 కోట్ల భూ కుంభకోణం కేసులో అరెస్టయిన వారికి సంబంధించిన మరిన్ని కీలక సమాచారాలు వెలుగులోకి వచ్చాయి. పళని దండపాణి మఠానికి చెందిన రూ. 100 కోట్ల భూమిని నకిలీ పత్రాలతో మోసపూరితంగా రిజిస్టర్ చేసిన కేసులో సబ్–రిజిస్ట్రార్ జస్టిన్ మణికందన్, మధ్యవర్తి జయప్రకాష్, మరియు న్యాయవాది శివకుమార్‌లను అరెస్టు చే సి జైలుకు పంపారు.
మరో రూ. 50 కోట్ల మోసం: పాఠశాల, మహిళా కళాశాల నిర్మాణం కోసం కేటాయించిన పబ్లిక్ ట్రస్ట్ భూమిని నకిలీ డీడీలు సృష్టించి వీరు అక్రమంగా విక్రయించారని సామాజిక కార్యకర్త ప్రభాకరన్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానం సీరియస్‌గా స్పందించి, పోలీసులకు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
చైన్నెలో దీపావళి
షాపింగ్ సందడి
– టీ నగర్, పురసైవాక్కంలో పోటెత్తిన జనం
సాక్షి, చైన్నె: దీపావళి పండు షాపింగ్ సందడి ఊపందుకుంది. చైన్నెలో ఆదివారం వర్తక కేంద్రాలు కిట కిటాలడాయి. దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో కొత్త వస్త్రాలు, ఆభరణాలు , గృహోపకరణాలు కొనడానికి చైన్నెలోని ప్రముఖ వ్యాపార కేంద్రాలైన టీ.నగర్, పురసైవాక్కంలలో ప్రజలు భారీగా తరలివస్తున్నారు. టీ.నగర్‌లోని ప్రముఖ రంగానాథన్ వీధిలో కాలు మోపేందుకు కూడా స్థలం లేనంతగా జనం కిటకిటలాడుతున్నారు. వీధి పక్కన అమ్మే చిన్న దుకాణాల నుండి పెద్ద పెద్ద జౌళి, బంగారు షాపుల వరకు విపరీతమైన వ్యాపారం జరుగుతోంది. దొంగతనాలు, నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. టీ.నగర్, పాండీ బజార్ పరిసరాల్లో సుమారు 300 కి పైగా అధునాతన నిఘా కెమెరాలను, వాచ్ టవర్లను ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ కెమెరాలు జనంతో కలిసి ఉండే పాత నేరస్తులను సులభంగా గురిపెట్టి గుర్తుపట్టే సామర్థ్యం కలిగి ఉన్నాయి. సాదాసీదా దుస్తుల్లో పోలీసులు గస్తీలో ఉన్నారు. ప్రజల సాయం కోసం పోలీస్ సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు.


