బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ‘మురసు’ | - | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ‘మురసు’

Nov 2 2026 1:53 AM | Updated on Nov 2 2026 1:53 AM

● చైన్నె, తిరువళ్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలకు అవకాశం ● శివారు జిల్లాలో తెరపించి తెరపించి వాన

సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాను వేగంగా బలపడుతోంది. ఇది మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా మారి నైరుతి, పశ్చిమ–మధ్య బంగాళాఖాతం మీదుగా వాయువ్య దిశగా పయనించనుందని చైన్నె వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం అర్ధరాత్రి లేదా వేకువ జామున ఈ తుఫాను దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని నెల్లూరు – నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక

తుఫాను తీవ్రత కారణంగా తమిళనాడు తీరప్రాంత జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి చైన్నె, తిరువళ్లూరు జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల పిడుగులు, మెరుపులతో కూడిన గరిష్ట వర్షపాతం నమోదుకానుంది. గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని అలర్ట్‌చేశారు.చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట, వెల్లూరు, నీలగిరి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడు, పశ్చిమ కనుమలు, పుదుచ్చేరిలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలుపడనున్నాయి. మంగళవారం నీలగిరి జిల్లాలో భారీ వర్షంకకు అవకాశం ఉంది. ఆదివారం పలు జిల్లాలో విస్తారంగా వర్షం పడింది. తెరపించి తెరపించి చైన్నె, శివారులలో వర్షం పడింది. గడిచిన 24 గంటలలో కూనూరు (నీలగిరి జిల్లా) 7 సెం.మీ, కాంచీపురం. కోత్తగిరి, ఈరోడ్‌, భవానీసాగర్‌, సత్యమంగళం, పూందమల్లి, సెంగంలలో 5 సెం.మీ వర్షం పడింది. తీరప్రాంత ప్రజలకు వాతావరణ శాఖ సూచనలు ఇచ్చింది. తీరం దాటే సమయంలో గాలుల వేగం ఎక్కువగా ఉంటుందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, తుఫాను ప్రభావిత జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

‘మురసు’ అని పేరు ఎలా వచ్చింది?

ప్రపంచ వాతావరణ సంస్థ సూచనల ప్రకారం 2020లో బంగాళాఖాతం, అరేబియా సముద్ర తుఫానులకు నామకరణం చేసేందుకు భారతదేశంతో సహా 13 దేశాలు కొన్ని పేర్లను ప్రతిపాదించాయి. ఇందులో భాగంగా భారత వాతావరణ శాఖ సిఫార్సు చేసిన మురసు అనే తమిళ పదాన్ని ఈ తుపానుకు నిర్ణయించారు. ప్రాచీన తమిళనాడులో రాజుల కాలంలో యుద్ధాలు, విజయోత్సవాలు, ముఖ్యమైన హెచ్చరికలను లేదా విపత్తులను ప్రజలకు చాటడానికి ‘మురసు’ (ఢంకా లేదా నగారా) మోగించేవారు. 2020లోనే చైన్నె వాతావరణ కేంద్రం మాజీ డైరెక్టర్‌ ఎన్‌. భువియరసన్‌ ఈ పేరును ప్రతిపాదించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement