
అరెస్టయిన ఆరోగ్యరాజ్
● ఇద్దరి అరెస్టు
తిరువళ్లూరు: తొమ్మిదో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడుతూ బాలిక గర్భానికి కారణమైన యువకుడితో పా టు మరో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌లోని ఓ గ్రామానికి చెందిన బాలిక(14) ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలిక ఇంటి సమీపంలోనే ఆరా అలియాస్ ఆరోగ్యరాజ్ (23) పాల ప్యాకెట్ వ్యాపారం చేస్తూ జీవనం చేస్తున్నాడు. ఆరోగ్యరాజ్‌కు బాలికతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక వ్యవహారం అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థికి తెలియడంతో బాలిక తల్లిదండ్రులకు విషయాన్ని చెబుతానని బెదిరించి బాలుడు సైతం బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక గర్భం దాల్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు తిరువళ్లూరు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికపై లైంగిక దాడులకు దిగిన ఆరోగ్యరాజ్, బాలుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.