చెన్నెలో ‘పాప్‌’ సాంస్కృతిక వేడుక | Sakshi
Sakshi News home page

చెన్నెలో ‘పాప్‌’ సాంస్కృతిక వేడుక

Published Thu, Jul 20 2023 1:34 AM

పాప్‌ కల్చర్‌ చాటే వేషాధారణలో ఔత్సాహికులు  - Sakshi

సాక్షి, చైన్నె : విదేశాలలోని పాప్‌ కల్చర్‌ను చైన్నెలో పరిచయం చేసే విధంగా సాంస్కృతిక వేడుకకు సన్నాహాలు చేపట్టామని కామిక్‌ కాన్‌ఇండియా వ్యవస్థాపకుడు జతిన్‌ వర్మ తెలిపారు. పాప్‌ కల్చర్‌ ఔత్సాహికులతో చైన్నెలో మొదటి ఎడిషన్‌కు ఆహ్వానం పలికే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇందులో జతిన్‌ వర్మ మాట్లాడుతూ, పాప్‌ కల్చర్‌ మ్యాజిక్‌ను ఈ సారి చైన్నె నగరానికి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యామని వివరించారు. భారతీయ కామిక్‌ సృష్టికర్తలు, ప్రఖ్యాత కళాకారులు ఈ వేడుకకు తరలి రాబోతున్నారన్నారు. కళలు, వినోదం, స్మజనాత్మకత, మరుపురాని అనుభవాన్ని చైన్నె వాసులకు కలిగించే విధంగా ఈ వేడుక 2024 ఫిబ్రవరి 17,18 తేదీలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement