తండ్రిని చంపిన కిరాతకుడు | - | Sakshi
Sakshi News home page

తండ్రిని చంపిన కిరాతకుడు

Apr 23 2023 2:26 AM | Updated on Apr 23 2023 8:00 AM

- - Sakshi

అన్నానగర్‌: కన్న తండ్రి అనే కనికరం కూడా లేకుండా మెడపై కాలుతో తొక్కి దారుణంగా హత్య చేసిన ఘటన తిరుపత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. నాట్రంపల్లి సమీపంలోని పచూర్‌ ప్రాంతానికి చెందిన మోహన్‌ (55) రైతు. ఇతని భార్య వరమతి (50). వీరికి కుమారులు గిరి (32), ముత్తు (28), కుమార్తె సంధ్య (20) ఉన్నారు. రెండో కుమారుడు ముత్తు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.

ప్రేమ విఫలమవడంతో మనస్తాపానికి గురై మూడు నెలలుగా ఇంటిలో నుంచి బయటకు రావడం లేదు. ఈ క్రమంలో శుక్రవారం ముత్తు ఒక్కసారిగా కోపోద్రిక్తుడై తండ్రి మోహన్‌ మెడను కాలుతో నొక్కి హత్య చేశాడు. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన తల్లి వరమతి, చెల్లెలు సంధ్య అతన్ని అడ్డుకున్నారు. కర్రతో వారిద్దరి తలపై కొట్టాడు. ఇద్దరూ ఇంటిలో స్పృహతప్పి పడిపోయారు. వారి కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చి ఇద్దరినీ రక్షించి చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికులు అతనిని కట్టివేసి నాట్రంపల్లి పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు మోహన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ముత్తును అరెస్టు చేశారు. అతనిని శుక్రవారం రాత్రి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి వేలూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement