బహిరంగ సభను జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

బహిరంగ సభను జయప్రదం చేయాలి

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

సూర్యాపేట అర్బన్‌ : అఖిల భారత కిసాన్‌ సభ 36వ జాతీయ మహాసభల సందర్భంగా ఈ నెల 15న మధ్యాహ్నం 3గంటలకు నల్లగొండలోని ఎన్‌జీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఐద్వా జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ కార్మికుల సమస్యలు, గ్రామీణ ప్రజల జీవనోపాధి వంటి అంశాలపై మహాసభల్లో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత, జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి, జిల్లా అధ్యక్షురాలు వెంకట చంద్ర, జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ అండం నారాయణమ్మ, షేక్‌ ఖాజాబీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement