తుంగతుర్తి : మహిళా కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ తిరుమలప్రగడ అనురాధ కిషన్‌రావు మూడోసారి నియమితులయ్యారు. ఈ మేరకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎరబెల్లి స్వర్ణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, తనకు అప్పగించిన బాధ్యతను సమర్థ్ధవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు మహిళలను రాజకీయంగా చైతన్యవంతులుగా చేసేందుకు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


