ప్రైవేట్‌ బడుల్లోనూ ప్రశస్త్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ బడుల్లోనూ ప్రశస్త్‌

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

గుర్తింపుతోనే సరి కాదు!

ప్రశస్త్‌ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సమస్యలను గుర్తించడమే కాకుండా, వారికి అవసరమైన సహాయాన్ని అందించడం కూడా కీలకం. గుర్తించిన పిల్లలకు అవసరమైన వైద్య పరీక్షలు, నిపుణుల సలహాలు, ప్రత్యేక విద్యా సదుపాయాలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే పోర్టల్‌లో వివరాల నమోదు కేవలం గణాంకాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

సూర్యాపేటటౌన్‌ : ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను చిన్న వయసులోనే గుర్తించి వారికి తగిన విద్యా, వైద్య సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘ప్రశస్త్‌’ కార్యక్రమాన్ని ఇక నుంచి ప్రైవేట్‌ పాఠశాలల్లోనూ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌ ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకొని వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

దివ్యాంగుల గుర్తింపు..

18 ఏళ్ల లోపు వయసున్న పిల్లల్లో వివిధ రకాల దివ్యాంగ లక్షణాలు, అభ్యసన ఇబ్బందులను ముందుగానే గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రశస్త్‌ (ప్రీ అసెస్మెంట్‌ హోలిస్టిక్‌ స్క్రీనింగ్‌ టూల్‌) కార్యక్రమాన్ని రూపొందించింది. విద్యార్థుల్లో ఉన్న లోపాలను గుర్తించి వారికి సరైన సమయంలో అవసరమైన విద్య, వైద్య సాయం అందించడం ద్వారా వారు కూడా మామూలు పిల్లల లాగానే చదువులో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది.

పాఠశాల యాజమాన్యాలపై బాధ్యత

ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్‌ పాఠశాలల్లోనూ ప్రశస్త్‌ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో యాజమాన్యాల బాధ్యత పెరిగింది. ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రశస్త్‌ పోర్టల్‌లో నమోదు చేసుకొని నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులకు స్క్రీనింగ్‌ నిర్వహించాలి. ప్రత్యేక అవసరాలు ఉన్నవారిని గుర్తించి వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలి. ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేసినా, నిర్దేశిత సమయంలో పూర్తి చేయకపోయినా ఆయా పాఠశాలల యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది.

1250 పాఠశాలలు

సూర్యాపేట జిల్లాలో సుమారు 1250 ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రశస్త్‌ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లోనూ స్క్రీనింగ్‌ నిర్వహించాలని జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు మొత్తం రెండు దశల్లో స్క్రీనింగ్‌ నిర్వహించనున్నారు. మొదట దశలో పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు, సిబ్బంది స్క్రీనింగ్‌ నిర్వహించిన తర్వాత రెండో దశలో ఐఈఆర్‌పీ, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తిస్తారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 30లోపు పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.

ఫ ప్రత్యేక అవసరాలున్న పిల్లల

గుర్తింపునకు సర్వే

ఫ 3 నుంచి 18 ఏళ్ల పిల్లలకు

ఉపాధ్యాయుల స్క్రీనింగ్‌

ఫ విద్యార్థుల వివరాలు

ప్రత్యేక పోర్టల్‌లో నమోదు

ఫ జిల్లాలో 1.40 లక్షల మంది

విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement