బాణసంచా దుకాణాలకు లైసెన్స్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

బాణసంచా దుకాణాలకు లైసెన్స్‌ తప్పనిసరి

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

వినియోగదారులూ జాగ్రత్తలు పాటించాలి

ప్రమాదం జరిగితే

సమాచారం ఇవ్వాలి

ప్రజలు అధీకృత, లైసెన్స్‌ కలిగిన దుకాణాల్లోనే బాణసంచా కొనుగోలు చేయాలి. ఇంటి వద్ద పొడి, చల్లటి ప్రదేశంలో నిల్వ చేయాలి. పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. బహిరంగ ప్రదేశాలలో, పెద్దల పర్యవేక్షణలోనే మాత్రమే బాణసంచా కాల్చాలి. కాటన్‌ దుస్తులు, పాదరక్షలు ధరించాలి. ఒక సారికి ఒకటికి మించి బాణసంచ వెలిగించ వద్దు, వెలిగించడానికి పొడవాటి అగరబత్తి లేదా కొవ్వొత్తిని ఉపయోగించాలి. రాకెట్లు, పైకి ఎగిరే వాటిని కాల్చేటప్పుడు అవి ఇళ్లు, కిటికీలు, తలుపులు, వాహనాల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఇరుకై న సందులు, గుడిసెలు, నివాస ప్రాంతాల సమీపంలో బాణసంచా కాల్చకూడదు. చేతిలో పెట్టుకొని వెలిగించడం, ఇతరులపైకి విసరడం, పేలని బాణసంచాను వెంటనే ముట్టుకోవడం చేయకూడదు. సింథటిక్‌, వదులుగా ఉండే దుస్తులు ధరించి బాణసంచా కాల్చడం ప్రమాదకరం.

సూర్యాపేటటౌన్‌ : బాణసంచా దుకాణాలు ఏర్పా టు చేసేందుకు వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్‌ పొందాలని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి కృష్ణారెడ్డి అన్నారు. దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయించేందుకు జిల్లాలోని మూడు ఫైర్‌ స్టేషన్ల పరిధిలో 112 తాత్కాలిక దుకాణాలను ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని శుక్రవారం ఆయన సాక్షి ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

దీపావళి సందర్భంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారు నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఒక దుకాణానికి మరో దానికి మధ్య కనీసం మూడు మీటర్ల దూరం ఉండాలి. విద్యుత్‌ సరఫరా కోసం నాణ్యమైన వైర్లను మాత్రమే వినియోగించాలి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దుకాణాల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా వ్యాపారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలి. ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి దుకాణం వద్ద మంటలను ఆర్పే రెండు సిలిండర్లు, నీటితో నింపిన డ్రమ్ములు, నో స్మోకింగ్‌ బోర్డులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. నిబంధనలను ఉల్లంఘించే దుకాణాదారులపై చర్యలు తీసుకుంటాం. 18 ఏళ్లు పైబడిన వారినే బాంబుల షాపులో పనిలో పెట్టుకోవాలి.

గాయాలైతే..

బాణసంచా కాల్చే సమయంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాలి. కాలిన గాయాలైతే ఆ ప్రాంతంపై చల్లటి నీటిని ధారగా పోయాలి. క్రీములు, నూనెలు వంటివి రాయకూడదు. గాయాలు తీవ్రంగా ఉంటే వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలి. కంటికి గాయమైతే స్వచ్ఛమైన నీటితో కడిగి వైద్య సహాయం పొందాలి. శ్వాసకోశ సమస్యలున్న వారు బాణసంచా కాల్చే ప్రదేశాలకు దూరంగా ఉండాలి.

అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు ఆందోళన చెందకుండా వెంటనే 101 లేదా 9949991101 నంబర్‌కు సమాచారం అందించాలి. సూర్యాపేట ఫైర్‌ స్టేషన్‌ 8712699328, కోదాడ స్టేషన్‌ 8712699330, హుజూర్‌నగర్‌ స్టేషన్‌ 8712699332 నంబర్లకు సమాచారం అందిచవచ్చు. ప్రమాదం జరిగిన ప్రదేశం, చిరునామా వివరాలను స్పష్టంగా తెలుపాలి. ప్రజ లు, వ్యాపారులు భద్రతా నిబంధనలను పాటించి పండుగను సురక్షితంగా జరుపుకోవాలి.

ఫ భద్రతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు

ఫ ప్రజలు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

ఫ అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే ఫైర్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేయాలి

ఫ జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ కృష్ణారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement