వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

సూర్యాపేట : యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌పవార్‌ అన్నారు. శుక్రవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన యువజనోత్సవాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత విద్యతో పాటు ఇతర రంగాలలో కూడా రాణించాలన్నారు. ఈ సందర్భంగా యువ కళాకారులకు జానపద నృత్యం, పాటలు, పెయింటింగ్‌, వీధి నాటకం, కవిత్వం వంటి అంశాలలో పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బి.హరిసింగ్‌, డీఆర్వో డి. ప్రేమ్‌రాజ్‌, జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకట్‌రెడ్డి, మై భారత్‌ యూత్‌ ఆఫీసర్‌ గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు

గ్రూప్‌ జానపద నృత్యం పోటీల్లో కోదాడ కేఆర్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు ప్రథమ, ద్వితీయ బహుమతిని జెడ్పీహెచ్‌ఎస్‌ సూర్యాపేట, తృతీయ బహుమతిని ఇమాంపేట టీజీటీడబ్ల్యూఆర్‌జేసీ విద్యార్థులు గెలుచుకున్నారు. , జానపద పాటల్లో ప్రథమ టీటీడబ్ల్యూఆర్‌డీసీ గ్రూప్‌ సూర్యాపేట, ద్వితీయ టీజీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ గ్రూప్‌, ఇమాపేంట, తృతీయ తుంగతుర్తి టీజీటీడబ్ల్యూఆర్‌జేసీ, వీధి నాటకంలో ప్రథమ ఆర్‌డీఆర్‌డీ గ్రూప్‌ తుంగుర్తి, ద్వితీయ టీజీటీడబ్ల్యూఆర్‌జేసీ తుంగతుర్తి, తృతీయ టీజీటీడబ్ల్యూఆర్‌జేసీ చివ్వెంల గెలుచుకున్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement