కిసాన్‌ మహాసభలను జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కిసాన్‌ మహాసభలను జయప్రదం చేయాలి

Nov 1 2026 8:07 AM | Updated on Nov 1 2026 8:07 AM

● జూలకంటి రంగారెడ్డి

సూర్యాపేట : నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిలభారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని అఖిలభారత కిసాన్‌ సభ కేంద్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్టార్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన రైతు సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 15న నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలి రావాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు సమగ్ర విధానాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌ పిట్టల రవి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొలిశెట్టి యాదగిరిరావు, ప్రధాన కార్యదర్శి కందాల శంకర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, వృత్తి సంఘాల నాయకులు నాగారపు పాండు, కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ చెరుకు ఏకలక్ష్మి, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement