కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు కారులో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు.
- 8లో
చట్టాలపై అవగాహన అవసరం
చివ్వెంల(సూర్యాపేట): విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండడం చాలా అవసరమ ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి కె.భవ్య అన్నారు. శని వారం సూర్యాపేటలో నిర్వహించిన అఖిల భారత పాఠశాల అవగాహన–సురక్షిత్ బచ్చన్ అభియాన్ సదస్సులో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ నామినేటేడ్ సభ్యులు గుంటూరు మధు, నల్లపాటి మమత, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బి.ప్రవీణ్ కుమార్, టీచర్లు పాల్గొన్నారు.


