పశు వైద్య సేవలకు రెండు రాష్ట్రాల నుంచి.. | - | Sakshi
Sakshi News home page

పశు వైద్య సేవలకు రెండు రాష్ట్రాల నుంచి..

Nov 1 2026 8:07 AM | Updated on Nov 1 2026 8:07 AM

పశు వైద్య సేవలకు రెండు రాష్ట్రాల నుంచి..

కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ)గా పనిచేస్తున్న పెంటయ్య అందిస్తున్న సేవలకు మంచి గుర్తింపు వచ్చింది. పశువులకు, పెంపుడు జంతువులకు క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేస్తున్నారు. కాళ్లు విరిగిన, ప్రమాదంలో గాయపడి వెన్నెముక విరిగిన జంతువులకు ఆయన ప్రత్యేక శస్త్రచికిత్సలు చేస్తాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న జంతువులకు చికిత్స అందించి వాటి ప్రాణాలు కాపాడుతున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు కాపరులు సైతం తమ గొర్రెలను చికిత్స కోసం కోదాడకు తీసుకురావడం విశేషం. నిత్యం 70 నుంచి 80 పశువులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌, విజయవాడ, ఖమ్మం నుంచి సైతం పశువులు, పిల్లులు, కుక్కలను చికిత్స కోసం ఇక్కడకు తీసుకొస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement