సూర్యాపేటటౌన్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా శనివారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ నరసింహ పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి అమరులకు ఘనంగా నివాళులర్పించారు. డీఎస్పీ ప్రసన్న కుమార్, ఆర్మ్డ్ డీఎస్పీ నరసింహాచారి, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ శివ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ఐలు, పోలీసు సంఘం అధ్యక్షుడు రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు


