సూర్యాపేట టౌన్ : ఆర్ముడ్ రిజర్వ్‌లో కానిస్టేబుల్స్‌గా పని చేస్తున్న రాంబాబు, రామారావు, అశోక్, బషీర్‌లు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్స్‌గా ఉద్యోగోన్నతి పొందారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నరసింహ వారికి ప్రమోషన్ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రమోషన్‌తో పాటుగా బాధ్యతలు పెరుగుతాయని, అందుకు అనుగుణంగా విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, ఆర్ముడ్ డీఎస్పీ నరసింహాచారి, ఆర్‌ఐ ప్రవీణ్‌కుమార్, పోలీస్ సంఘం అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.


