అర్నబ్‌తో ఆందోళన | - | Sakshi
Sakshi News home page

అర్నబ్‌తో ఆందోళన

Oct 29 2026 1:30 AM | Updated on Oct 29 2026 1:30 AM

నిలిచిన వరి కోతలు

భానుపురి(సూర్యాపేట) : అర్నబ్‌ తుపాన్‌తో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాన్‌ కారణంగా రెండు రోజుల పాటు జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోత దశలో ఉన్న వేలాది ఎకరాల వరి పంట దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను భయంతో మంగళవారం పెద్ద ఎత్తున రైతులు వరి పైరులు కోసి వడ్లను ట్రాక్టర్లలో మిల్లులు, మార్కెట్‌కు తరలించారు. మార్కెట్‌కు సెలవు కావడంతో కొనుగోళ్లు జరక్క ధాన్యం అలాగే ఉండడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

ఈదురు గాలులతో నష్టం

తుపాను ప్రభావంతో జిల్లాలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. మంగళవారం నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. బుధవారం గాలులతో పాటు చిరు జల్లులు కురిశాయి. గాలులకు కోదాడ, హుజూర్‌నగర్‌ ప్రాంతాల్లోని పలు మండలాల్లో కోత దశలో ఉన్న వరి పొలాలు నేల వాలాయి. చల్లటి గాలులు వీస్తుండడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వివిధ పనులమీద బయటకు వెళ్లే వారు, ఇళ్లలో ఉన్న వృద్ధులు సైతం వణికిపోయారు. వ్యవసాయ కూలీలు పనులు లేక ఇళ్లకు పరిమితమయ్యారు.

భిన్న పరిస్థితులు

పంట చేతికి వచ్చిన సమయంలో వర్షాలు వస్తే రైతులకు ఇబ్బందే. కానీ జిల్లా వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు పడితే చెరువులు, కుంటల్లోకి కొంత మేర నీరు చేరుతుందని కొందరు రైతులు ఆశపడుతున్నారు. ఇదే సమయంలో పంట కోత దశలో ఉన్న రైతులు తమ పంటచేలు ఆగమవుతాయని ఆందోళన చెందుతున్నారు.

అర్నబ్‌ తుపాన్‌తో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు మొదలయ్యాయి. దాంతో వరి కోతలు ముందుకు సాగలేదు. గాలులకు పొలాలు నేలవాలి వరి పైరు దెబ్బతింటుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తితీత పనులు సైతం నిలిచిపోయాయి. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కొనుగోలు జరిగి ఎగుమతి కాక ఉండి పోయిన ధాన్యంతో పాటు రైతులు విక్రయానికి తెచ్చిన ధాన్యం కొంతమేర తడిసింది. చాలామంది రైతులు పట్టాలను కప్పుకొని ధాన్యం రాశులు తడవకుండా జాగ్రత్త పడ్డారు.

ఫ తుపాను ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు

ఫ రెండు రోజుల్లో

భారీ వర్షాలకు అవకాశం

ఫ కోత దశలో వేలాది ఎకరాల వరి

ఫ మార్కెట్లో తడుస్తున్న రైతుల ధాన్యం

ఫ గాలులకు నేలవాలుతున్న వరిపైరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement