నేరేడుచర్లకు చెందిన మారయ్యగౌడ్ మూడెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని తన పంటను కాపాడుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం వరి చేను కోతదశలో ఉండగా బుధవారం అర్నబ్ తుపాన్ కారణంగా భారీగా వీచిన గాలులకు మూడు ఎకరాల వరి పంట నేలవాలింది. దాంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతు ఆందోళన చెందుతున్నాడు. అప్పులు తెచ్చి సాగు చేసిన పంటచేను చేతికి అందే దశలో వర్షం కారణంగా నష్టపోవాల్సి వచ్చిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.


