ఐఏఎల్‌ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఐఏఎల్‌ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి

Oct 29 2026 1:30 AM | Updated on Oct 29 2026 1:30 AM

చివ్వెంల(సూర్యాపేట) : జిల్లాలో ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ (ఐఏఎల్‌) సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని శ్రీనివాస్‌ కోరారు. బుధవారం సూర్యాపేట కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి, న్యాయవాదుల సంక్షేమానికి, భద్రత కల్పించేందుకు సంఘం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి తొగటి మురళి, గౌరవ అధ్యక్షుడు నాతి సవీందర్‌కుమార్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తాళ్లపల్లి సత్యనారాయణ, గట్ల నర్సింహారావు, కంచర్ల సతీష్‌కుమార్‌, దోరపల్లి రమేష్‌, పెండెం వాణి, యరగాని వెంకటేశ్వర్లు, దయాకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

అర్వపల్లి దర్గా

ఉర్సుకు ఏర్పాట్లు

అర్వపల్లి: అర్వపల్లిలోని హజ్రత్‌ సయ్యద్‌ ఖాజా నసీరుద్దీన్‌ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వక్ఫ్‌బోర్డు రాష్ట్ర అసిస్టెంట్‌ కార్యదర్శి అమీర్‌ హైమద్‌, జిల్లా ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ దస్తగిరి తెలిపారు. వచ్చే నెల 6, 7 తేదీల్లో జరిగే ఉర్సు ఉత్సవాలకు చేపడుతున్న ఏర్పాట్లను బుధవారం వారు పరిశీలించారు. దర్గా దారికి తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. ఉర్సు ఉత్సవాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. వారి వెంట వక్ఫ్‌బోర్డు సూపరింటెండెంట్‌ మహ్మద్‌ ఫయాజ్‌ అలీ, సోఫీ, దర్గా సిబ్బంది ఉన్నారు.

విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా కోర్టు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి గోపు రజిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జీజేఎం పాఠశాలలో నిర్వహించిన శ్రీసురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌శ్రీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు లైంగిక నేరాల పట్ల అవగహన కలిగి ఉండాలన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు చెప్పాలన్నారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ నామినేటేడ్‌ సభ్యులు గుంటూరు మధు, డిఫెన్స్‌ కౌన్సిల్‌ సభ్యురాలు కె.ప్రియదర్శిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌పై స్పష్టత ఇవ్వాలి

సూర్యాపేట : ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం రూ.10 వేలు చెల్లించిన దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ప్లాట్ల కొనుగోలుదారుల సమస్యలను పరిష్కరించాలని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పంతంగి వీరస్వామిగౌడ్‌ కోరారు. బుధవారం సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు. పాత వెంచర్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ భూములను నాలా కన్వర్షన్‌ ద్వారా ప్లాట్లుగా రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా జీవో జారి చేయాలన్నారు. ఈ అవకాశం లేక రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ఆధారపడిన వ్యాపారులు, చిన్న ప్లాట్లు కొనుగోలు చేసిన పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ధరణిలో భూ వివరాల సమస్యలను పరిష్కరించడంతోపాటు రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ఆయన వెంట అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు జలగం సత్యంగౌడ్‌, నాయకులు దేవత్‌ కిషన్‌నాయక్‌, అమరవాది శ్రావణ్‌, వెన్న శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement