చివ్వెంల(సూర్యాపేట) : లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి ఆలయ ఆవరణలో యాదవ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిభ్రవరిలో జరగనున్న జాతరకు ముందే మంత్రివర్గ ప్రత్యేక సమావేశం నిర్వహించి, జాతరకు సబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దగట్టు పాలన బాధ్యతలు యాదవుల చేతుల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, తగిన బడ్జెట్ కేటాయించి, శాశ్వత పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. తగుల్ల జనార్దన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు వట్టె జానయ్య యాదవ్, నాయకులు వజ్జె వీరయ్య యాదవ్, మతకాల చలపతిరావు, మద్ది శ్రీనివాస్ యాదవ్, నారబోయిన వెంకట్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్


