లైంగిక నేరాలపై అవగాహన కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

లైంగిక నేరాలపై అవగాహన కలిగి ఉండాలి

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

చివ్వెంల (సూర్యాపేట) : విద్యార్థులకు లైంగిక నేరాలపై అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌. అపూర్వ రవళి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎంఏఎం పాఠశాలలో నిర్వహించిన అఖిల భారత పాఠశాల అవగహన సురక్షిత బచ్‌పన్‌ అభియాన్‌ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై వివరించారు. విద్యార్థులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ నామినేటెడ్‌ సభ్యుడు గుంటూరు మధు. నల్లపాటి మమత, డిఫెన్స్‌ కౌన్సిల్‌ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్‌కుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఫ జిల్లా కోర్టు మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి అపూర్వ రవళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement