కోదాడ: ఈ నెల 28 నుంచి 30 వరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా కబడ్డీ పోటీలలో పాల్గొనే జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్‌రెడ్డి, నామ నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జట్టు కెప్టెన్‌గా శ్రీజ, సభ్యులుగా త్రివేణి, దివ్య, దీప్తి, అమూల్య, సంధ్య, అంజలి, సోని, సుష్మ, మౌనిక, హర్షిత, వర్షిణి, తేజతో పాటు స్టాండ్‌బైగా ప్రసన్న, కావ్యను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. జట్టుకు కోచ్‌గా శ్రీను వ్యవహరిస్తారని తెలిపారు. ఎంపికై నా క్రీడాకారులకు మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కందుల కోటేశ్వరరావు క్రీడా దుస్తులు అందించారు.
విత్తన డిక్లరేషన్ వెనక్కి తీసుకోవాలి
హుజూర్‌నగర్ : ప్రభుత్వం విత్తన డిక్లరేషన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హుజూర్‌నగర్‌లోని అమరవీరుల స్మారక భవనంలో నిర్వహించిన సీపీఎం నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఎకరానికి రూ.30 వేలు ముందుగా చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకు పోతోందని విమర్శించారు. నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించే అఖిలభారత రైతు సంఘం మహాసభలలో రైతాంగ సమస్యలపై సమరశంఖం పూరించనున్నట్లు ఆయన తెలిపారు. పల్లె వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. పాండు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. శంకర్, నాయకులు అనంత ప్రకాష్, నగేష్, యాకూబ్, సైదులు, బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.
నీటిని పొదుపుగా వాడుకోవాలి
నడిగూడెం : ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు కురవడం లేదని, ఉన్న కొద్దిపాటి నీటిని పొదుపుగా వాడుకోవాలని జడ్పీ సీఈఓ శిరీషా సూచించారు. మంగళవారం మండలంలోని నడిగూడెం, వల్లాపుర, సిరిపురం, బృందావనపురం, వేణుగోపాలపురం గ్రామాల్లో జరుగుతున్న వీబీ జీరాంజీ పనులను, చేయూత పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాలు అడుగంటుతున్నా యని, రైతులు యాసంగిలో తక్కువ నీటితో సాగయ్యే పంటలను మాత్రమే వేసుకోవాలన్నారు. కూలీలకు పనులు కల్పించాలన్నారు. ఆమె వెంట ఎంపీడీఓ ఎల్.మల్సూర్, ఎంపీఓ వీరాంజనేయులు, ఈసీ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మల్లారెడ్డి ఉన్నారు.


