సూర్యాపేట : జిల్లా కేంద్రానికి బుల్లెట్ రైలు సాధించేంతవరకు ఉద్యమాలు కొనసాగుతాయని మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ఆదివారం 45వ రోజు నిర్వహించిన దీక్షలో పట్టణ మేరు సంఘం నాయకులు పాల్గొన్నారు. సాయంత్రం దీక్షలను విరమింపజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగానే బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీక్షలో మేరు సంఘం పట్టణ అధ్యక్షుడు మునగాల సతీష్, నాయకులు వారణాసి వెంకటేశ్వర్లు, సిద్ధప్ప, కర్నె ఉపేందర్, వర్షం సంతోష్, వీరేశ్ కిషోర్, లక్ష్మీనారాయణ, వినయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి సభ్యులు కుంట్ల ధర్మార్జున్, చలమల్ల నరసింహ, భయ్యా మల్లికార్జున్, మట్టి పెల్లి సైదులు, తదితరులు సంఘీభావం తెలిపారు.


