పాలకవీడు: రోడ్ల అనుసంధానంతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆది వారం పాలకవీడు మండలంలోని ముసిఒడ్డుసింగారం నుంచి రోళ్లవారిగూడెం, కేతిరెడ్డిగూడెం గ్రామాలను కలుపుతూ రూ.1.80 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సరైన రోడ్డు మార్గాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి అనేక ప్రాంతాలకు రోడ్డు మంజూరు చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గుత్తికొండ భూపాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎన్‌వీ.సుబ్బారావు, మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోతీలాల్, జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
హుజూర్‌నగర్ : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో నియోజకవర్గ పరిధిలోని 5,319 మంది లబ్ధిదారులకు రూ 21.62 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను, హుజూర్‌నగర్, మఠంపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. అంతకు ముందు పట్టణంలో దివంగత విశ్రాంత ఉపాధ్యాయురాలు నూకల జానకి కుంటుంబాన్ని మంత్రి పరామర్శించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ, రాష్ట్ర పేరిక కార్పోరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ హరిసింగ్, ఆర్‌డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ డి.రాధిక, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బచ్చు రామారావు, తహసీల్దార్ కవిత, నాయకులు యరగాని నాగన్న గౌడ్, కోతి సంపత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి


