హుజూర్‌నగర్ : మూఢనమ్మకాలను నిర్మూలించడం, సైన్స్ పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంలో జన విజ్ఞాన వేదిక కీలక పాత్ర పోషిస్తున్నదని వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెలిమెల రాజేశ్వర్ అన్నారు. ఆదివారం హుజూర్‌నగర్‌లో నిర్వహించిన జేవీవీ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడారు. సమాజంలో సైన్స్ ప్రాముఖ్యతను ముందుకు తీసుకు పోవటంలో జేవీవీ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. విద్యార్థులకు చెకుముకి పోటీలు నిర్వహించడం, పుస్తకాలను ప్రచురించడం, వాటిని విద్యార్థులు చదివే విధంగా ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం ఉస్మానియా యూనివర్శిటీ నుంచి జువాలజీలో డాక్టరేట్ అందుకున్న క్రాంతి కుమార్‌ను సత్కరించారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కలకుంట్ల సైదులు రెండేళ్ల కార్యక్రమాలను నివేదించారు. జి.రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన సభలో వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ అందె సత్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, ఎంఈఓ సైదా నాయక్, రాష్ట్ర, జిల్లా బాధ్యులు జాఫర్, దుర్గాప్రసాద్, నాగరాజు, మక్బూల్ భాషా, రామచంద్రయ్య, మహిళా ప్రతినిధులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్


