స్టాక్‌ రిజిస్టర్లు అప్‌డేట్‌గా ఉంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

స్టాక్‌ రిజిస్టర్లు అప్‌డేట్‌గా ఉంచుకోవాలి

Sep 19 2026 8:56 AM | Updated on Sep 19 2026 8:56 AM

తిరుమలగిరి(తుంగతుర్తి) : ఎరువుల దుకా ణాల యజమానులు తప్పనిసరిగా అన్ని స్టాక్‌ రిజిస్టర్లను అప్‌డేట్‌గా ఉంచుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి జి.శ్రీధర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన తిరుమలగిరిలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి మాట్లాడారు. ఎరువులను ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దుకాణదారులు నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మట్టపల్లిలో నిత్యకల్యాణం

మఠంపల్లి: మట్టపల్లిలోని రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం అర్చకులు స్వామివారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనువంశిక ధర్మకర్తలు, ఈఓ, అర్చకులు పాల్గొన్నారు.

ఉచిత శిక్షణ

నల్లగొండ : ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు పోలీస్‌ శాఖ ఉచితంగా శిక్షణ ఇవ్వనుందని నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన 500 మంది యువతీ యువకులను ఎంపిక చేసి, నల్లగొండ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణ ఇస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement