సూర్యాపేట : బుల్లెట్ రైలు సాధించే వరకు ఉద్యమం ఆగదని మార్కెట్ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, డాక్టర్ రామ్మూర్తి అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి, అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. శుక్రవారం ప్రజానాట్యమండలి కళాకారులు దీక్షలో పాల్గొన్నారు. కళాకారులు ఆటలతో బుల్లెట్ ట్రైన్ సాధనపై ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించారు. దీక్షలో కళాకారులు వేల్పుల వెంకన్న, బచ్చలకూరి రాంబాబు, యాతాకుల ప్రవీణ్, చిత్రం శ్రీను, పల్లెల రాము, నందిపాటి సతీష్, కంపాటి చంద్రశేఖర్, ఉప్పల వెంకట్‌గోపి, కందుకూరి శ్రీకాంత్, నెమ్మాది మనోజ్, పిడమర్తి అశోక్, ప్రభాకర్ సునీత పాల్గొన్నారు.


