భానుపురి (సూర్యాపేట) : శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, దళితులు ఉన్నత పదవుల్లో ఉంటే ఓర్వలేకనే బీఆర్‌ఎస్ నాయకులు అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్, పీసీసీ అధికార ప్రతినిధి దూడెం వెంకట రమణ అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దళితులపై ఏనాడూ నిజమైన ప్రేమ లేదని ఆరోపించారు. రాజ్యాంగపరంగా రిజర్వేషన్లను అమలు చేయడం తప్ప దళితుల సంక్షేమం, సాధికారత కోసం ఆయన మనస్ఫూర్తిగా చేసిందేమీ లేదని విమర్శించారు. సమావేశంలో టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీఉల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్
చైర్మన్ వెంకటరమణ


