ఆయిల్‌ పామ్‌ రైతులకు సహకారం అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ పామ్‌ రైతులకు సహకారం అందిస్తాం

Sep 11 2026 8:10 AM | Updated on Sep 11 2026 8:10 AM

సూర్యాపేట : ఆయిల్‌ పామ్‌ తోటలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల వసతులు, రాయితీలు కల్పిస్తామని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి తీగల నాగయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయిల్‌ పామ్‌ రైతు సంఘం ప్రతినిధులు, ఆయిల్‌ ఫెడ్‌ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, డ్రిప్‌ కంపెనీ సిబ్బందితో సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతులు పలు డిమాండ్లను జిల్లా ఉద్యాన అధికారికి విన్నవించారు. సమావేశంలో ఉద్యాన సాంకేతిక అధికారి ముత్తినేని మహేష్‌, ఉద్యాన అధికారులు కట్ట స్వాతి, అనిత, ప్రదీప్తి, ప్రమిత, ఆయిల్‌ ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ అలీమ్‌, ఎంఈ ఇంజనీర్‌ నరేష్‌, ఆయిల్‌ పామ్‌ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఫ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ

అధికారి నాగయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement