ఇరుకు దారులు.. వాహనాల బారులు | - | Sakshi
Sakshi News home page

ఇరుకు దారులు.. వాహనాల బారులు

Sep 11 2026 8:10 AM | Updated on Sep 11 2026 8:10 AM

సూర్యాపేట అర్బన్‌: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పాత మార్కెట్‌ ప్రాంతంలో సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరుకై న రోడ్లు, అక్రమ పార్కింగ్‌లు, రోడ్లపైనే వ్యాపారాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుడకుడ రోడ్డు నుంచి పాత మార్కెట్‌ వరకు, కొత్త బస్టాండ్‌ ఫ్లైఓవర్‌ ప్రాంతంలో సాయంత్రం అయ్యిందంటే వాహనాలు బారులు కడుతున్నాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాలతో పాటు లారీలు, ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు సైతం రోడ్లపైనే గంటల తరబడి నిలుపుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

అత్యవసర సేవలకూ తప్పని తిప్పలు

ప్రధాన రహదారులతోపాటు కాలనీ రోడ్లలోనూ వాహనాలను ఇష్టానుసారంగా పార్కింగ్‌ చేస్తున్నారు. అంబులెన్సులు కూడా రాలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్‌కు వెళ్లాలంటే భయం

పాత మార్కెట్‌ చుట్టూ రోడ్డుకు ఇరువైపులా కూరగాయల దుకాణాలు, తోపుడు బండ్లు రోడ్డుపైకి విస్తరించడంతో నడిచి వెళ్లడమే కష్టంగా మారింది. సాయంత్రం వేళల్లో ఇక్కడకు వచ్చే మహిళలు, వృద్ధులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. వాహనాల యజమానులను ప్రశ్నిస్తే గొడవలకు దిగుతున్నారని వాపోతున్నారు. రోడ్లను ఆక్రమించి వాహనాలు నిలుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పోలీసులు వచ్చి తొలగించినా, ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికే వస్తోందని పట్టణ వాసులు పేర్కొంటున్నారు.

సూర్యాపేట పాత మార్కెట్‌లో ట్రాఫిక్‌ అవస్థలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement