కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరకు చెందిన కనగాల జనార్దన్‌రావు తమ్మర చెరువు ఆక్రమణ జరిగిందని, దీనిపై విచారణ చేయాలని తహసీల్దార్, ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు. వారు పట్టించుకోకపోవడంతో గత నెల 29న కలెక్టరేట్‌కు వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని మరుసటి రోజు సదరు ఫిర్యాదును కోదాడ ఆర్డీఓకు పంపారు. ఆర్డీఓ ఈ నెల 6న అదే దరఖాస్తును తిరిగి కోదాడ తహసీల్దార్‌కు పంపి చర్యలు తీసుకోవాలని కోరారు.
శ్రీరంగాపురానికి చెందిన పల్లా సీతరామాంజనేయులకు వంశపారపర్యంగా వస్తున్న భూమి ఉంది. ఇతని పాలివాళ్లు ఇదే సర్వేనెంబర్‌లో భూమి అమ్మగా ఇతరులు కొనుగోలు చేశారు. వారు కొనుగోలు చేసిన భూమి కన్నా ఎక్కువగా అక్రమంగా పట్టా చేసుకున్నారు. దీనిపై సీతరామాంజనేయులు తహసీల్దార్, ఆర్డీవోలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై విచారణ చేయాల్సిన అధికారులు తిరిగి ఆర్డీవోకే పంపించారు.
మండల, డివిజన్ స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదనే కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు సూర్యాపేటకు వెళ్తున్నాం. తీరా అక్కడ అర్జీ ఇస్తే, మళ్లీ ఆ దరఖాస్తును విచారణ పేరుతో అదే అధికారులకు పంపితే ఏం ప్రయోజనం. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాలి. లేకపోతే ప్రజావాణి అనేది కేవలం ఒక ప్రహసనంగా మారే ప్రమాదం ఉంది.
– కుదరవెల్లి బసవయ్య, కోదాడ
కోదాడ: కిందిస్థాయి అధికారులు స్పందించడం లేదని.. జిల్లా కేంద్రంలోని ప్రజావాణికి వెళ్తే, ఆ అర్జీలు మళ్లీ కిందిస్థాయి అధికారుల వద్దకే తిరిగొస్తున్నాయి. కలెక్టర్ స్పందిస్తారన్న ఆశతో వెళ్లిన సామాన్యులకు నిరాశే మిగులుతోంది. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌కు ఇచ్చే అర్జీల దుస్థితే ఇలా ఉంటే.. డివిజన్, మండల స్థాయిల్లో జరిగే ప్రజావాణి పరిస్థితి ఏంటని బాధితులు వాపోతున్నారు.
ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా..
ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, ఎన్‌ఎస్‌పీ భూముల ఆక్రమణలపై వస్తున్న ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నాయి. కోదాడ ప్రభుత్వ వైద్యశాల భూమి ఆక్రమణపై పలుమార్లు కలెక్టరేట్‌లో ఫిర్యాదులు ఇచ్చినా ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా అధికారులు సమాధానం దాటవేస్తున్నారు.
తప్పు తేలినా... చర్యలు శూన్యం
కోదాడ పరిధిలోని ఎన్‌ఎస్‌పీ భూములున్న సర్వే నంబర్ 148లో ఆక్రమణలు నిజమేనని కలెక్టర్ చేయించిన సర్వేలో తేలింది. ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి కంటే అక్కడ 10 గుంటలు తక్కువగా ఉందని సర్వేయర్ నివేదిక ఇచ్చారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రికి దాత ఇచ్చిన రెండెకరాల్లో 20 గుంటల భూమి తక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. ఆక్రమణలు నిరూపితమైనా అధికారులు ఆ భూములను రికవరీ చేయకుండా కాలయాపన చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఫ ప్రజావాణిపై ప్రజల పెదవిరుపు
ఫ కిందిస్థాయి అధికారులు స్పందించక
పోవడంతో కలెక్టరేట్‌లో ఫిర్యాదు
ఫ ఆ అర్జీలను పరిష్కరించాలని తిరిగి వారికే పంపిస్తున్న ఉన్నతాధికారులు


