చివ్వెంల(సూర్యాపేట) : జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి శివరాం ప్రసాద్ అన్నారు. గురువారం జల్లా కోర్టు ప్రాంగణంలో పీపీలు, కోర్టు కానిస్టేబుల్స్‌కు ఈ నెల 12న నిర్వహించే లోక్ అదాలత్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్, విద్యుత్, మోటార్ వెహికల్, బ్యాంకు, గృహహింస, ఎకై ్సజ్ వంటి కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీంతో ఇరువర్గాల వారు గెలిచిన వారవుతారని, అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండదన్నారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భవ్య, పీపీలు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


