భానుపురి (సూర్యాపేట) : పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, పోరాట పటిమ తరతరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ వంటి మహానాయకుల చరిత్రను నేటి తరానికి అందిస్తూ, యువత చదువుతో పాటు అన్ని రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్‌ఓ ప్రేమ్ రాజ్, బీసీ వెల్ఫేర్ అధికారి విశాల్, నాయకులు ఊరా రామ్మూర్తి యాదవ్, బొమ్మగాని శ్రీనివాస్, చింతలపాటి చిన్న శ్రీరాములు, మట్టిపల్లి సైదులు, పోతుగంటి వీరాచారి, చల్లమల నరసింహ, తల్లమల్ల హసేన్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


