నిత్యావసరాల ధరల నియంత్రణలో విఫలం | - | Sakshi
Sakshi News home page

నిత్యావసరాల ధరల నియంత్రణలో విఫలం

Sep 10 2026 3:32 AM | Updated on Sep 10 2026 3:32 AM

భానుపురి (సూర్యాపేట) : దేశంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక అన్నారు. నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేటు శక్తులకు ఆర్థిక వనరులు చేకూరే విధంగా ప్రభుత్వాలు విధానపర నిర్ణయాలు తీసుకోవడం వల్లే నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయన్నారు. 14 రకాల నిత్యవసర వస్తువులను రేషన్‌ షాపుల ద్వారా సామాన్యులకు అందించాలన్నారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు సూరం రేణుక, సహాయ కార్యదర్శి సంతోషిమాత, జిల్లా కమిటీ సభ్యులు ఐతరాజు పద్మ, కట్ట కల్పన, జయమ్మ, రేణుక, అనసూయ, గౌరమ్మ, మమత, రహమతి, మీనాక్షి, రాధా, కుమారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement