సూర్యాపేట : సూర్యాపేటకు రైల్వేలైన్ సాధనకు అందరం కలిసి పోరాడుదామని, అందుకు వాసవి సేవా సమితి మద్దతు ప్రకటిస్తుందని వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బచ్చు పురుషోత్తం, దేవరశెట్టి నాగరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష పోస్టు కార్డుల ఉద్యమంలో వారు పాల్గొని ప్రధానమంత్రికి రాసిన 1000 పోస్ట్ కార్డులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాకు రైల్వే మార్గం వస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రకటించిన బుల్లెట్ రైలు మార్గాన్ని కొంతమంది తమ స్వార్ధం కోసం ఇతర మార్గాలకు మళ్లించారన్నారు. రైల్వేలైన్ సాధించే వరకు పోరాట సమితి వారితో తాము కలిసి ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్దన్, సభ్యులు బిక్కుమల్ల ఉపేందర్, రాచూరి ప్రతాప్, నల్లపాటి అప్పారావు, భద్రయ్య, మంజుల, అంజయ్య, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుండా రమేష్, వాసవి సేవా సమితి కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మిరియాల సుధాకర్, రాచకొండ శ్రీనివాస్, మహంకాళి ప్రణీత్, కలకోటి నరసయ్య, సహాయ కార్యదర్శిలు కర్నాటి కృష్ణ, బచ్చు శ్రీనివాస్, తప్సి అనిల్, ధనుంజయ్ పాల్గొన్నారు.
27వ రోజు కొనసాగిన దీక్షలు
బుల్లెట్ ట్రైన్ సాధన రిలే నిరాహార దీక్షలు 27వ రోజు కొనసాగాయి. దీక్షలో తెలంగాణ రైతాంగ సమితి నాయకులు నల్లెడ రాంరెడ్డి, అబ్దుల్ కరీం, వెంకన్న యాదవ్, నరేశ్, సురేందర్, మాధవరెడ్డి యార్కచర్ల శోభ, సుధాకర్, క్రాంతికుమార్, మహేష్, తదితరులు కూర్చున్నారు. దీక్షలకు ధర్మార్జున్, రామనాచారి, చల్లమల్ల నరసింహ, పేర్ల నాగయ్య, విజయశ్రీ, మల్లయ్య, వనిత మద్దతు తెలిపారు.
ఫ ప్రధానికి వాసవి సేవాసమితి పోస్టు కార్డులు


