సూర్యాపేట : బుల్లెట్ రైలు అలైన్మెంట్ మార్చే కుట్రపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో తిరుగుబాటు కొనసాగిస్తామని, జాతీయ రహదారి వెంట బుల్లెట్ ట్రైన్ కారిడార్ లక్ష్యంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్షాల పోరాట సమితి కన్వీనర్ ప్రొఫెసర్ జానకిరెడ్డి అన్నారు. పోరాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సద్ద్దులచెరువులో సామూహిక జలదీక్ష నిర్వహించారు. సుమారు 200 మంది దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సూర్యాపేటకు వచ్చే బుల్లెట్ ట్రైన్‌ను దారి మళ్లించేందుకు చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే కేంద్రం ప్రకటించిన విధంగా బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్‌ను జాతీయ రహదారి 65కు సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిలపక్షాల నాయకులు పెద్దిరెడ్డి రాజా, డాక్టర్ రామ్మూర్తి, జుట్టు కొండ సత్యనారాయణ, ధర్మార్జున్, డేవిడ్ కుమార్, మట్టిపెల్లి సైదులు, చల్లమల్ల నరసింహ, భూపతి రాములు, బూర మల్సూర్‌గౌడ్, యాదగిరిరావు, పెద్దిరెడ్డి కళ్యాణ్ చక్రవర్తి, వీరేంద్ర, సట్టు నాగయ్య, వెలుగు వనిత, కృష్ణ పాల్గొన్నారు.
బుల్లెట్ ట్రైన్‌తోనే అభివృద్ధి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వస్తాయని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్యగౌడ్ అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 22వ రోజు కొనసాగాయి. దీక్షకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అలైన్మెంట్‌లో మార్పు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బూర మల్సూర్‌గౌడ్, చల్లమల్ల నరసింహ, కర్నాటి కిషన్, తదితరులు ఉన్నారు. దీక్షకు జిల్లా పాస్టర్ల సంఘం అధ్యక్షుడు దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. దీక్షలో సిఐటీయూ నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, ఏకలక్ష్మి, వెంకటనారాయణ శివకృష్ణ, నవీన్, ధనియాకుల శ్రీనివాస్, ముత్తయ్య, సోమయ్య, సాయికుమార్, సురేష్, మార్క్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫ పోరాట సమితి ఆధ్వర్యంలో జలదీక్ష


