సూర్యాపేటటౌన్ : గంజాయి మత్తు పాఠశాలల విద్యార్థుల వరకు చేరింది. మత్తు పదార్థాల విక్రయదారులు మైనర్లు, ముఖ్యంగా స్కూల్, కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గంజాయితో విద్యార్థులను ఆకర్షించడం, అలవాటు పడిన వారినే ఇతరులకు సరఫరా చేసేలా ప్రోత్సహించడం లాంటివి జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి.
కొండమల్లేపల్లి
ఘటనతో కలకలం..
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో మైనర్లు గంజాయి మత్తులో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్‌ను హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మత్తు పదార్థాల ప్రభావం మైనర్ల ఆలోచనా విధానంపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ ఘటనే నిదర్శనం. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో గంజాయి విక్రయాలు, వినియోగంపై పోలీసులు మరింత దృష్టి సారించాల్సి ఉంది.
మైనర్లు కావడంతో కేసుల పెట్టకుండానే..
గంజాయి సేవిస్తూ పట్టుబడుతున్న మైనర్లపై కేసులు పెట్టకుండా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగిస్తున్న సందర్భాలు ఉన్నాయి. మత్తుకు బానిసైన కొందరిని డీఅడిక్షన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అసలు సరఫరాదారులు, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విద్యార్థులే టార్గెట్..
పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు, శివారు ప్రాంతాల్లో విద్యార్థులకు గంజాయి చేరుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదట సరదాగా ప్రయత్నించేలా చేసి.. ఆ తర్వాత మత్తుకు బానిసలుగా మార్చుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్నేహితుల ద్వారా గంజాయి పరిచయం తాగడం, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తుల నుంచి మత్తు పదార్థాలు పొందడం వంటి మార్గాలు కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి.
గంజాయి మత్తులో
స్కూల్ విద్యార్థులు
దారితప్పుతున్న మైనర్లు
స్కూల్, కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు
తరచూ పోలీసులకు
పట్టుబడుతున్న కొందరు
మైనర్లు కావడంతో
కౌన్సెలింగ్‌కే పరిమితం
కట్టడి చేయకుంటే ప్రమాదరక పరిణామాలే అంటున్న నిపుణులు
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటేనే..
విద్యార్థుల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు, చదువుపై ఆసక్తి తగ్గడం, కొత్త స్నేహాలు, ఇంట్లో ఎక్కువ డబ్బు అడగడం, ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించడం వంటి అంశాలను తల్లిదండ్రులు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు కూడా విద్యార్థులపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.
జిల్లాలో ఈ ఏడాది కేసులు ఇలా..
గంజాయి కేసులు 20
కౌన్సిలింగ్ పొందిన గంజాయి
బాధితుల సంఖ్య 15


