రాజకీయ పార్టీలు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

రాజకీయ పార్టీలు సహకరించాలి

Aug 20 2026 7:20 AM | Updated on Aug 20 2026 7:20 AM

భానుపురి (సూర్యాపేట) :

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ తేజస్‌నంద్‌ లాల్‌ పవార్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ వీసీ హాల్‌లో రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ ఓటరు లిస్టులో ఏమైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులకు డ్రాఫ్ట్‌ రోల్‌ అందించామన్నారు. ఎన్నికల నిబంధనలపై రాజకీయ పార్టీ ప్రతినిధులు.. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బి.హరిసింగ్‌, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్‌, సి సెక్షన్‌ సూపరింటెండెంటట్‌ రాజేందర్‌ రెడ్డి, రాజేశ్వరరావు, చల్లమల్ల నరసింహ, ఎండి హాబిద్‌, ఎం.స్టాలిన్‌, సత్యనారాయణ, డి.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తోందని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. బుధవారం సూర్యాపేటల కలెక్టరేట్‌లో జిల్లా మహిళా శక్తి ఉత్సవంలో భాగంగా వియ్‌ హబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బూట్‌ క్యాంప్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. మహిళామణులు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. సూర్యాపేటలో చేపట్టిన మహిళా శక్తి భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ సన్యాసయ్య, సీఈఓ సీతా, డీడబ్ల్యూఓ నరసింహారావు, అడిషనల్‌ డీఆర్‌డీఓ సురేష్‌, డీపీఎం అరుణ్‌ కుమార్‌, ఏపీఎంలు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు స్వయం సహాయక మహిళలు, వియ్‌ హబ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ జహీర్‌ అక్తర్‌ షేక్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement