బుల్లెట్‌ ట్రైన్‌ ఉద్యమ బాటలో ఆర్యవైశ్యులు | - | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ ట్రైన్‌ ఉద్యమ బాటలో ఆర్యవైశ్యులు

Aug 20 2026 7:20 AM | Updated on Aug 20 2026 7:20 AM

సూర్యాపేట : సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ అలైన్‌మెంట్‌ కొనసాగించాలంటూ బుధవారం ఆర్య వైశ్య సంఘం నాయకులు జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్ష బాట పట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బుల్లెట్‌ ట్రైన్‌ మార్గాన్ని శంషాబాద్‌ నుంచి సూర్యాపేట మీదుగా అమరావతి, చైన్నెకి వెళ్లే విధంగా ప్రతిపాదన చేసిన రాష్ట్ర ప్రభుత్వం అలైన్‌మెంట్‌ మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముందుగా ప్రకటించిన అలైన్‌మెంట్‌ను మార్చొద్దన్నారు. ఆర్యవైశ్యుల రిలే నిరాహార దీక్షకు సూర్యాపేట పట్టణ ప్రముఖులతో పాటు వివిధ సంఘాలు సంఘీభావం తెలిపాయి. జాతీయ రహదారి 65కు సమాంతరంగా బుల్లెట్‌ ట్రైన్‌, రైల్వే కారిడార్‌ సాధనకు చేపట్టిన 6వ రోజు రిలే నిరాహార దీక్షలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మీలా మహదేవ్‌, బండారు రాజా, తోట శ్యామ్‌ ప్రసాద్‌, పోతుగంటి వెంకటేశ్వర్లు, కలకోట లక్ష్మయ్య, వెంపటి శబరినాథ్‌, కర్నాటి కిషన్‌, ఈగ దయాకర్‌ గుప్త, ఈగ వెంకటేశ్వర్లు, బొమ్మిడి లక్ష్మీనారాయణ, వెంపటి సురేష్‌, గుండా శ్రీధర్‌, వెంపటి పురుషోత్తం, తప్సి గాంధీ, గోండ్రాల అశోక్‌, వంగవేటి రమేష్‌, బజ్జూరి శ్రీనివాస్‌, నవిలిపురి నరేందర్‌ పాల్గొన్నారు.

మున్సిపల్‌ పాలకవర్గం తీర్మానం చేయాలి

కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిన బుల్లెట్‌ ట్రైన్‌ అలైన్‌మెంట్‌ను కొనసాగించాలని సూర్యాపేట మున్సిపల్‌ పాలకవర్గం ప్రత్యేక తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని బుల్లెట్‌ ట్రైన్‌ సాధన అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొరిశెట్టి నివేదితకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నివేదిత మాట్లాడుతూ పాలక వర్గ సభ్యుల అనుమతితో తీర్మానం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్షాల నాయకులు కన్వీనర్‌ ఆరుట్ల జానకిరెడ్డి, కుంట్ల ధర్మార్జున్‌, మండాది డేవిడ్‌ కుమార్‌, జీడి భిక్షం, కర్ణాటి కిషన్‌, కొత్తపల్లి శివకుమార్‌ రేణుక, పేర్ల నాగయ్య, బూర వెంకటేశ్వర్లు, వీరేంద్ర, నేరెళ్ల మధు, ఎర్ర అఖిల్‌, భయ్యా మల్లికార్జున్‌, సట్టు నాగయ్య,సాయి అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

6వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement