హుజూర్‌నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి గురువారం హుజూర్‌నగర్, కోదాడ నియోజవవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 8.45 గంటలకు చింతలపాలెం మండలం పాత వెల్లటూరుకు చేరుకుంటారు. అక్కడ ఎంబీసీ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. పలు నూతన భవనాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటలకు సూర్యాపేట కలెక్టరేట్‌లో స్మార్ట్ రేషన్ కార్డులు, అర్హులైన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు వెళతారని మంత్రి పీఆర్‌ఓ వెంకట్‌రెడ్డి బుధవారం తెలిపారు.
నారసింహుడికి
గరుడ వాహన సేవ
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో బుధవారం అర్చకులు శ్రీలక్ష్మీనారసింహస్వామి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో మూలవిరాట్ స్వామికి పంచామతాభిషేకం నిత్యహోమం నిర్వహించారు. అనంతరం నిత్య కల్యాణం చేపట్టి స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. క్షేత్రపాలకుడైన శ్రీ వీరాంజనేయ స్వామికి నాగవల్లి దళాలతో ప్రత్యేక అర్చనలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ గావించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయకుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై
అవగాహన ఉండాలి
తుంగతుర్తి : సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) పెండెం వెంకటరమణ అన్నారు. తుంగతుర్తిలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం సీజనల్ వ్యాధులపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో ఇళ్ల పరిసరాలలో నీరునిల్వ లేకుండా చూసుకోవా లన్నారు. నీరు నిల్వ ఉంటే దోమలు వ్యాప్తిచెంది మలేరియా, డెంగీ, చికున్ గున్యావ్యాధుల బారిన పడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా కీటక జనిత నియంత్రణ అధికారి డాక్టర్ నాగరాజు, వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి, సామాజిక ఆరోగ్య అధికారి మాలోతు బిచ్చునాయక్, మాణిక్యమ్మ, రాజల్ బీ, ప్రిన్సిపాల్ సంధ్యారాణి వైస్ ప్రిన్సిపాల్ ఆశా జ్యోతి, జేవీపీ అబ్జలున్నిసా బేగం, సోమన్న, యాదగిరి, నరసింహాచారి పాల్గొన్నారు.


